: వివాహాల శుభవేళ కొండెక్కుతున్న పుత్తడి

పవిత్ర కార్తీకమాసంలో వివాహాది శుభకార్యాలు జోరుగా సాగుతున్న వేళ బంగారం ధర మరోసారి కొండెక్కుతోంది. ప్రజల నుంచి ఆభరణాల కొనుగోళ్లకు మద్దతు పెరగడం, డాలర్ బలపడటం తదితర కారణాలతో పది గ్రాముల పుత్తడి ధర రూ. 26 వేలకు చేరుకుంది. దీంతో గడచిన వారం రోజుల వ్యవధిలో బంగారం ధర రూ. 800కు పైగా పెరిగినట్లయింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 35 వేలకు చేరువైంది. ప్రస్తుతం కొనసాగుతున్న వెడ్డింగ్ సీజన్ డిమాండ్ వల్లే ధరలు పెరిగాయని బులియన్ వ్యాపారులు వ్యాఖ్యానించారు. కాగా, అటు అంతర్జాతీయ మార్కెట్లో నవంబర్ 16 తరువాత బంగారం ధర తొలిసారిగా ఔన్సుకు 1,086 డాలర్లను అధిగమించింది.

More Telugu News