: ఇమ్రాన్ మాజీ భార్య రెహామ్ ను పక్కన కూర్చోబెట్టుకున్న పైలట్!

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన పైలట్ ఒకరు, పాక్ రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ ను కాక్ పిట్ లోనికి అనుమతించి, విచారణను ఎదుర్కొంటున్నాడు. లాహోర్ నుంచి లండన్ కు బయలుదేరిన పీకే 788 విమానంలో నిన్న ఈ ఘటన జరిగింది. తనను కాసేపు కాక్ పిట్ లోకి అనుమతించాలని రెహామ్ కోరగా, అందుకు ఆ పైలట్ అంగీకరించాడట. నిబంధనలకు విరుద్ధమైన ఈ చర్యలపై విచారణకు అదేశించినట్టు పీఐఏ ప్రతినిధి డానియల్ గిలానీ వెల్లడించారు. ఆమె కోరిక మేరకే పైలట్ అనుమతించినా, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కాగా, 42 ఏళ్ల రెహామ్ బీబీసీ న్యూస్ లో పని చేస్తూ, 2013లో పాకిస్థాన్ కు వచ్చి ఇమ్రాన్ ను పెళ్లాడి, ఆపై విడిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News