: వడ్డీ రేట్లలో మార్పులు లేనట్టే!... నేడే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేడు జరగనుంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ నేతృత్వంలో జరగనున్న ఈ సమీక్షలో పెద్దగా సంచలన నిర్ణయాలేమీ ఉండకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. గత సమీక్షలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే క్రమంలో వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ, ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంతేకాక సెప్టెంబర్ తో ముగిసిన రెండో క్వార్టర్ లో జీడీపీ అంచనాలను మించి 7.4గా నమోదు కావడం కూడా పరపతి నిర్ణయాల్లో మార్పులేమీ ఉండబోవని తెలుస్తోంది. చైనా జీడీపీని మించి అధిక వృద్ధి నమోదైన నేపథ్యంలో ప్రస్తుత స్థితినే కొనసాగించడం మేలని పారిశ్రామిక వర్గం కూడా భావిస్తోంది.

More Telugu News