: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

ఉదయం నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన భారతీయ స్టాక్ మార్కెట్లు చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండటంతో ఇన్వెస్టర్ లు వేచి చూసే ధోరణిని అవలంబించారు. దీంతో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 26,145 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 7 పాయింట్లు కోల్పోయి 7,935కు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్... ఫ్యూచర్ రీటెయిల్ (15.01%), రతన్ ఇండియా పవర్ (11.15%), ఇన్ఫో ఎడ్జ్ (9.66%), వెల్స్ పన్ కార్ప్ (8.95%), ఐడీబీఐ బ్యాంక్ (8.16%). టాప్ లూజర్స్... శ్రీ రేణుకా షుగర్స్ (-9.50%), టోరెంట్ ఫార్మా (-5.83%), కైలాష్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్ (-4.82%), గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ (-4.54%), కాక్స్ అండ్ కింగ్స్ లిమిటెడ్ (-4.53%).

More Telugu News