: కదలాలంటే గూగుల్ 'సెర్చ్' ఇంజన్ కావాల్సిందే!

ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలని భావిస్తున్నవారి నుంచి.. కొత్త ప్రాంతాల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నవారి వరకూ గూగుల్ సెర్చింజన్ ను ఆశ్రయించడం సర్వసాధారణమై పోయింది. ఇక స్మార్ట్ ఫోన్ల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న వేళ, ట్రిప్ ఐడియాల కోసం గూగుల్ ను వెతుకుతున్న వారి సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 50 శాతం పెరిగిందని తాజాగా వెల్లడైన అధ్యయనం వెల్లడించింది. వీటిల్లో ఫలానా ప్రాంతంలో ఏముంది? ఆ ప్రాంతం ఎక్కడుంది? వంటి విచారణలు అధికంగా జరుగుతున్నాయని, ప్రధాన ప్రాంతాల గురించిన సెర్చ్ 33 శాతం పెరుగగా, మంచి హోటల్స్ కోసం వెతుకుతున్న వారి సంఖ్య 49 శాతం పెరిగిందని తెలుస్తోంది. ఇక ఎంచుకున్న ప్రాంతాన్ని గురించిన వీడియోలు యూట్యూబ్ లో చూస్తున్న వారి సంఖ్య 64 శాతం పెరిగింది. ట్రావెల్ సంబంధిత మొబైల్ సెర్చ్ కంప్యూటర్లతో పోలిస్తే, స్మార్ట్ ఫోన్లలో వేగంగా పెరుగుతోందని అధ్యయన రూపకర్త ఓలివర్ హాక్ మన్ తెలిపారు. సమీప భవిష్యత్తులో మొబైల్ వాడకం మరింతగా పెరగనున్నందున, సెర్చింగ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నట్టు ఆయన అంచనా వేశారు.

More Telugu News