: ‘కేసీఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర’ ఆడియో విడుదల

రేడియో 'ఎల్లయ్య మామ' జానపద అకాడమీ రూపొందించిన ‘కేసీఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర’ అనే ఆడియో సీడీని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ పునాదులు, మూలాలు జానపదంలో ఉన్నాయన్నారు. జానపదాలు కనుమరుగవడానికి కారణం టీవీలు, సెల్ ఫోన్లేనన్నారు. రేడియో ఎల్లయ్య మామ అకాడమీ సేవలను ఆయన ప్రశంసించారు. జానపద అకాడమీలకు ప్రాణం పోయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి మాట్లాడుతూ, జానపదం తెలంగాణలో పుట్టి... తెలంగాణలోనే పెరిగిందన్నారు. తెలంగాణ భాష, యాసను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం వల్ల ఎందరో కళాకారులు తయారయ్యారని, ఈ ఉద్యమం దూసుకెళ్లడానికి కేసీఆర్ భాష, యాస ఎంతో తోడ్పడ్డాయన్నారు.

More Telugu News