: ఈ ఒక్క విషయంలో కలిసిన కాంగ్రెస్, బీజేపీ!

ప్రతి విషయంలో నిప్పు, నీరులా ఉంటూ, ఏకతాటిపై నిలవని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్వలింగ సంపర్కుల చట్టంపై మాత్రం ఒకే మాట మీదకు వచ్చాయి. ఇది భారత జాతి సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు వెల్లడించినప్పటికీ, ఈ రెండు పార్టీలూ మరోసారి స్వలింగ బంధానికి మద్దతు పలికాయి. సుప్రీంకోర్టు ఐపీసీ సెక్షన్ 377 నిలిపివేత అంశాన్ని మరోసారి పరిశీలించాలని టైమ్స్ లిట్ ఫెస్ట్ లో పాల్గొన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదంటూ ఢిల్లీ హైకోర్టు తీసుకున్న ఆదేశాలను సుప్రీంకోర్టు మార్చకుండా ఉండాల్సిందని చిదంబరం వ్యాఖ్యానించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలూ మారాల్సిన అవసరముందని జైట్లీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జంటలు 'గే సెక్స్' వైపు మారుతున్న తరుణంలో వారందరినీ జైళ్లలో ఉంచడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

More Telugu News