: రెండేళ్ల తరువాత ఆ యుద్ధ విమానాలు ఇక కనిపించవు!

వచ్చే రెండళ్లలో మిగ్-27 యుద్ధ విమానాలను పూర్తిగా తొలగించనున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా వెల్లడించారు. వీటి స్థానంలో రఫాలే, తేజాస్ విమానాలను చేరుస్తామని ఆయన తెలిపారు. "రష్యా నుంచి మిగ్-27 విమానాలను తెచ్చుకున్న తరువాత వాటిని అప్ గ్రేడ్ చేయలేదు. దేశానికి ఎంతో సేవచేసిన ఆ విమానాలు ఇక రిటైర్ కానున్నాయి. భవిష్యత్తులో అన్ని మిగ్ లనూ నిలిపివేస్తాం. ఆపై మరిన్ని యుద్ధ విమానాలను వాయుసేనకు అందించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం" అని వివరించారు. వాయుసేనలో యుద్ధ విమానాల్లో మహిళల నియామకాలు జరుగుతాయని, ఇప్పటికే ఎందరో యువతులు శిక్షణ తీసుకుంటున్నారని, వారిలో కొందరిని ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లలో నియమిస్తామని రాహా తెలిపారు.

More Telugu News