: కేంద్ర ఉద్యోగాల వెల్లువ... ఖాళీలు 7.5 లక్షలు, ఖాళీ కానున్నవి 17 లక్షలు

వచ్చే పదేళ్లలో 17 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు దక్కనున్నాయి. జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని ఏడో వేతన సంఘం కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో పొందుపరిచిన వివరాల మేరకు 2014 జనవరి నాటికే 7.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి వుంది. దీనికి అదనంగా వచ్చే పదేళ్లలో 10 లక్షల మంది పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుత ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు కావడమే ఇందుకు కారణం. ఒక్క రైల్వే శాఖలోనే 4.93 లక్షల మందికి పైగా రిటైర్ మెంటును తీసుకోనుండగా, రక్షణ శాఖలోని సివిల్ విభాగంలో 1.51 లక్షల మందికి పైగా పదవీ విరమణ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రైల్వేల్లో 2,35,527, పట్టణాభివృద్ధి శాఖలో 12,010, హోం శాఖలో 69,244, ఆర్థిక శాఖలో 80,397, రక్షణ శాఖలో 1,87,054, ఐటీ కమ్యూనికేషన్స్ లో 62,616, ఆడిటింగ్ శాఖలో 20,210, ఇతర శాఖల్లో 82,942 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అన్ని ఖాళీలనూ పూరించేందుకు నియామకాలు చేపడితే, ఇండియాలో ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

More Telugu News