: హైదరాబాదు అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భాగస్వాములు కావాలి: కేసీఆర్ పిలుపు

హైదరాబాదు అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భాగస్వాములు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మాణాలు చేపట్టాలని, నిర్మాణాలలో గ్రీన్ ఫీల్డ్ యాక్టివిటీ పెంచాలని సూచించారు. ఆకాశ హర్మ్యాలు నిర్మించడంపై దృష్టిసారించాలని అన్నారు. అవినీతికి తావు లేని విధంగా లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అయితే అనుమతులు సహా నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, ఫ్లైయింగ్ స్క్వాడ్ గస్తీ కాస్తుందని ఆయన వారికి తెలిపారు.

More Telugu News