: శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలకు రూ. కోటి జరిమానా విధించండి: విజిలెన్స్ సిఫారసు

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యాసంస్థలుగా వెలుగొందుతున్న శ్రీచైతన్య, నారాయణలకు తెలంగాణ విజిలెన్స్ శాఖ షాక్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలు అనేక అవకతవకలకు పాల్పడుతున్నాయని తన నివేదికలో తెలిపింది. సొసైటీల పేరుతో ప్రతిఫలాపేక్ష లేకుండా విద్యాసంస్థలను నడుపుతామని చెప్పి, ఫక్తు వ్యాపార సంస్థలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. సొసైటీలను కూడా కేవలం కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేశారని... అనుమతులకు, నిర్వహణకు పొంతన లేకుండా ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఈ సంస్థలపై రూ. కోటి జరిమానా విధించాలని కూడా సిఫారసు చేసింది. టీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేశారు.

More Telugu News