: విశాఖలోనూ ర్యాగింగ్ భూతం... పాలిటెక్నిక్ కాలేజీలో జూనియర్లపై సీనియర్ల వేధింపులు

‘‘మమ్మల్ని సార్ అని పిలవాల్సిందే. మా బ్యాగులూ మోయాల్సిందే. ఈ విషయాలను ప్రిన్సిపాల్ కు చెబితే మాత్రం ఊరుకునేది లేదు’’ ఇదీ ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సొంతూరు విశాఖపట్నంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై వేధింపులకు పాల్పడుతున్న తీరు. వారం క్రితమే జరిగిన ఈ తంతు నిన్న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జూనియర్ విద్యార్థుల ఫిర్యాదులతో వేగంగా స్పందించిన కళాశాల అధికారులు ర్యాగింగ్ కు పాల్పడ్డ ఎలక్ట్రికల్ సెకండియర్ విద్యార్థులు రాహుల్, యశ్వంత్, దిలీప్ పృథ్వీ, స్టీఫెన్ లను సస్పెండ్ చేశారు. కళాశాలకు సీనియర్ విద్యార్థులు మద్యం తాగి వస్తున్నారని, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఫిర్యాదులున్నాయి. వీటిన్నింటిపై దృష్టి సారించిన కళాశాల ప్రిన్సిపల్, సీనియర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు.

More Telugu News