: బ్యాంకింగ్ సేవలను ఆపేస్తాం: హెచ్ఎస్బీసీ సంచలన ప్రకటన

ప్రైవేటు బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా లాభాలను అందుకోవడంలో విఫలమవుతున్న హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ, ఇండియాలో తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు వెల్లడించింది. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా నుంచి వెనక్కు మళ్లాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. "వ్యూహాత్మక సమీక్ష తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నాం. స్థిరమైన వృద్థి దిశగా పయనించేలా ఇండియాలో మా వ్యాపారాలను రివ్యూ చేస్తాం" అని ఆయన తెలిపారు. కాగా, ఇండియాలో కొనసాగుతున్న వేగవంతమైన వృద్ధిలో భాగస్వామ్యం పొందాలని వచ్చిన ఎన్నో విదేశీ వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలు, ఆపై మరెన్నో అవస్థలు పడి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. హెచ్ఎస్బీసీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇండియాలో ఫారిన్ వెల్త్ మేనేజ్ మెంట్ వ్యాపార తీరుతెన్నులకు ఉదాహరణగా నిలుస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News