: ఊబకాయం కంటే కంటికి కనబడని కొవ్వుతోనే ప్రమాదం

బయటికి కనిపించే ఊబకాయం కంటే కూడా, కంటికి కనబడకుండా శరీరంలో పేరుకుపోయే కొవ్వే ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ 26ను యాంటీ ఒబేసిటీ డేగా నిర్వహిస్తున్న సందర్భంగా పరిశోధకులు పలు సూచనలు చేశారు. ఉదర భాగంలో కొవ్వు నిల్వలు పెరిగిపోవడం ప్రమాదకరమని చెప్పారు. చర్మం కింది భాగాల్లో పేరుకుంటున్న కొవ్వు కారణంగా అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా కొలెస్ట్రాల్ హృద్రోగానికి దారితీసే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. మనదేశంలో స్థూలకాయులు హైపర్ టెన్షన్, థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వీటిపై అవగాహన లేకపోవడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని వారు తెలిపారు. ఇది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తోందని వారు వివరించారు. స్థూలకాయం సమస్యను గుర్తించగానే దానిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని వారు తెలిపారు.

More Telugu News