ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'క్యాండీ క్రష్' తరహాలో కొత్త గేమ్ 'బ్లసమ్ బ్లాస్ట్ సాగా'

Tue, Nov 24, 2015, 01:19 PM
Related Image అత్యధిక శాతం యూజర్లను ఆకట్టుకున్న క్యాండీ క్రష్ సాగా గేమ్ తరహాలో కింగ్ సంస్థ నుంచి మరో సరికొత్త గేమ్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ గేమ్ పేరు 'బ్లాసమ్ బ్లాస్ట్ సాగా' (BLOSSOM BLAST SAGA). ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ గేమ్ ను రూపొందించారు. దానికి సంబంధించిన యాప్ ను యూజర్లు తమ తమ యాప్ స్టోర్ ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ గేమ్ ను 10 లక్షల మందికిపైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆండ్రాయిడ్ 4.0, ఆపైన వెర్షన్, ఐఓఎస్ 5.1 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లకు ఈ గేమ్ లభిస్తోంది.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Articles (Latest)
Articles (Education)