: కాంతిమంతమైన చర్మానికి వంటింటి చిట్కాలు!

శీతాకాలంలో చలి వల్ల మన చర్మం మొద్దుబారి పోతుంటుంది. పొడిగా తయారైన చర్మం కాంతి విహీనంగా కనిపిస్తుంది. ఇది ఎంతో మందికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో ఎన్నో రకాల లోషన్లు, కాస్మొటిక్స్ లభిస్తున్నాయి. అయితే, మన వంటింటి చిట్కాలను కొన్నింటిని పాటిస్తే మన చర్మాన్ని కాంతిమంతంగా తయారు చేసుకోవచ్చు. * ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ జ్యూస్, ఒక స్పూన్ కొబ్బరి పాలు, సగం స్పూన్ తేనెను బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల సేపు అలాగే ఉంచి, నీటితో కడుక్కుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. * ఒక స్పూన్ పాల మీగడలో చిటికెడు పసుపు, రెండు చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మినహాయించి ముఖానికి ఈ పేస్టును అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో క్లీన్ గా కడుక్కుంటే కాంతులీనే చర్మ సౌందర్యం మీ సొంతమవుతుంది. * ఒక స్పూన్ ఎరుపు కందుల పౌడర్ లేదా ఆకుపచ్చ పెసరపప్పు పౌడర్ తీసుకుని దానికి కొద్దిగా పెరుగు, కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి, ఆరిపోయేంత వరకు వదిలివేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడుక్కుంటే గ్లోయింగ్ స్కిన్ మీదే. * ఆరెంజ్, నిమ్మకాయ తొక్కలను ఎండబెట్టుకోవాలి. అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఆ తొక్కలను పొడిగా చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ రెండు పౌడర్లను ఒక్కో స్పూన్ వంతున తీసుకుని, వాటికి రోజ్ వాటర్ కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉంచుకుని చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతులీనుతూ ఉంటుంది.

More Telugu News