: కార్డుతో పనిలేకుండా ఏటీఎం నుంచి డబ్బు... మేడిన్ చైనా న్యూ టెక్నాలజీ ఇదే!

ఏటీఎం కార్డుల దొంగిలింపు, క్లోనింగ్ వంటి అక్రమాలు పెరిగిన వేళ, వాటికి చెక్ పెట్టే అత్యాధునిక టెక్నాలజీని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అదే ఫేస్ రికగ్నిషన్. ఎటువంటి కార్డు లేకుండా ఏటీఎం ముందుకు వెళ్లి నిలబడితే ఖాతాదారుడి ముఖాన్ని స్కానింగ్ చేసి, ఆపై లావాదేవీలకు అవకాశాన్ని కల్పించే మెషీన్లను చైనా మర్చంట్ బ్యాంక్ పలు నగరాల్లో ఏర్పాటు చేసింది. వీటి ద్వారా భద్రత ప్రమాణాలు మరింతగా పెరిగినట్లవుతుందని బ్యాంకర్లు అంటున్నారు. ఒకేలా వున్న కవలలు వచ్చినా, ఎవరి ఖాతాను వారే తెరుచుకునే సాంకేతికత ఈ ఏటీఎం మెషీన్ల ప్రత్యేకతని చెబుతున్నారు. ముఖానికి మేకప్ వేసుకున్నా, కళ్లద్దాలు వంటివి పెట్టుకున్నా, రంగు మారినా ఇబ్బందులు ఉండవని, ఎటొచ్చీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మాత్రం మరోసారి బ్యాంకుకు వెళ్లి స్కానింగ్ తీయించుకోవాల్సి వుంటుందని వెల్లడించారు. ఈ తరహా ఏటీఎం మెషీన్లు విరివిగా అందుబాటులోకి వస్తే, ఏటీఎం కార్డు మోసాలు చాలా వరకూ తగ్గుతాయి కదా?

More Telugu News