: అవన్నీ తప్పుడు వార్తలు!... ‘అప్రూవల్’ కథనాలపై ‘పతంజలి’ ధ్వజం

తమ కొత్త ఉత్పత్తి ఆటా నూడుల్స్ పై ప్రచురితమైన కథనాలపై పతంజలి ధ్యాన కేంద్రం ఘాటుగా స్పందించింది. దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలన్నీ తప్పుడు వార్తలేనని తేల్చిచెప్పింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ధ్యాన కేంద్రం ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఆటా నూడుల్స్ తమ నుంచి అప్రూవల్ తీసుకోలేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అశిష్ బహుగుణను ఊటంకిస్తూ ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ కథనాన్ని రాసిన విషయం తెలిసిందే. ఈ కథనంపై వేగంగా స్పందించిన పతంజలి ధ్యాన కేంద్రం ఆ వార్త అవాస్తవమని పేర్కొంది. అంతేకాక ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తాము ఎంతమాత్రం అతిక్రమించలేదని కూడా ప్రకటించింది. అయితే ఫుడ్ సేఫ్టీ నుంచి అనుమతి తీసుకున్నామని మాత్రం ఆ సంస్థ పేర్కొనకపోవడం గమనార్హం.

More Telugu News