: ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆరేళ్ల కనిష్ఠానికి బంగారం ధర... ఇండియాలో రూ. 25 వేలకు!

పెరిగిన డాలర్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను కుదేలు చేసింది. బుధవారం నాడు బంగారంతో పాటు వెండి ధరలన్నీ పడిపోయాయి. యూఎస్ లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1,064.95 డాలర్లకు తగ్గింది. ఫిబ్రవరి 2010 తరువాత బంగారం ధర ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక డిసెంబర్ ఫ్యూచర్స్ సెషన్లో ధర 0.12 శాతం తగ్గి 1,067.30 డాలర్లకు చేరింది. డాలర్ బలపడటంతో పాటు డిసెంబరులో జరిగే పరపతి సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అనుమానాలు కూడా ధరల పతనానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, భారత మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 25 వేలకు చేరువైంది. ఈ ఉదయం బులియన్ సెషన్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 25,070గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 33,650కి తగ్గింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 10 పైసలు పెరిగి రూ. 66.12 వద్ద కొనసాగుతోంది.

More Telugu News