: జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్ల తయారీ విధానంపై ఆసక్తి చూపిన మోదీ

బ్రిటన్ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు జాగ్వార్ కారులో తిరిగిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, టర్కీకి బయలుదేరి వెళ్లేముందు టాటా మోటార్స్ అధీనంలో ఉన్న జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్ల తయారీ ప్లాంటును సందర్శించారు. టాటా సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ దగ్గరుండి మోదీకి ప్లాంటును చూపించారు. అక్కడ తయారవుతున్న లగ్జరీ కార్లను చూసి ముచ్చటపడ్డ మోదీ, ఓ కారు ముందు ఫోటో దిగి, ట్విట్టర్ లో పంచుకున్నారు. కార్ల తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. బ్రిటన్ లో అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న అతిపెద్ద ప్రైవేటు సంస్థ ఇదేనని తెలుసుకుని గర్వపడ్డానని తెలిపారు. మోదీ ప్లాంటు విజిట్ కార్యక్రమంలో జెఎల్ఆర్ సీఈఓ రాల్ఫ్ సేథ్ కూడా పాల్గొన్నారు.

More Telugu News