: ఫేస్ బుక్ వదిలేశాక ఎంత ఆనందమో!

ఆ అధ్యయనం ఫలితాలను చూసి పరిశోధకులే ఆశ్చర్యపోయారు. సామాజిక మాధ్యమాలను వాడిన వారు ఆనందంగా ఉన్నారా? గతంలో వాడి వదిలేసిన వారు ఆనందంగా ఉన్నారా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధ్యయనకారులు 'ఫేస్ బుక్'ను ఎంచుకున్నారు. మొత్తం 1095 మందిని అధ్యయనంలో భాగంగా చేసి ప్రశ్నించగా, 88 శాతం మంది తాము ఫేస్ బుక్ నుంచి బయటకు వచ్చి, పూర్తిగా దాన్ని చూడటం మానేశాక సంతోషంతో ఉన్నామని చెప్పారు. ఇక ఇదే వెబ్ సైట్ ను చూస్తున్న వారిలో 81 శాతం మంది 'తప్పదు' అనుకొని మాత్రమే నిత్యమూ చూస్తున్నారట. మిగతావారు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఉండటం ద్వారా ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నామని వివరించారు. ఇక ఈ అధ్యయనం ఫలితాలను తెలుసుకున్న ఫేస్ బుక్ యాజమాన్యం, ఖాతాలు తెరచినవారికి, తమకు ఏం కావాలో తెలియకుంటేనే అనవసర ఒత్తిడి వస్తుందని, ఈ విషయంలో స్పష్టత ఉంటే ఫేస్ బుక్ మంచి మిత్రుడేనని తెలిపింది.

More Telugu News