: హాలీవుడ్ సినిమా ప్రేరణతో రోబోను తయారుచేసిన బాలుడు

నాలుగేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా 'రియల్ స్టీల్'లో కనిపించిన రోబో స్ఫూర్తిగా గ్రీస్ దేశానికి చెందిన దిమిత్రిస్ హెట్జిస్ (15) అనే బాలుడు 3డీ ప్రింటెడ్ లైఫ్ సైజ్ రోబోను రూపొందించాడు. ప్రముఖ చిత్రకారుల్ని, రోబోటిక్, 3డీ రంగాలకు సంబంధించిన ఎందరో ప్రముఖులను కలిసి, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ఓ సరికొత్త రోబోకు ప్రాణం పోశాడు. ఈ రోబో రూపకల్పనకు 1400 గంటలు శ్రమించాడు. దీనిని తయారు చేసేందుకు ధెర్మోప్లాస్టిక్ పాలిమర్ ను ఉపయోగించాడు. ఈ పాలిమర్ 105 డిగ్రీల సెంటీగ్రేడ్ ను తట్టుకుంటుంది. ఓ సినిమా ప్రేరణగా సరికొత్త రోబోను రూపొందించిన దిమిత్రిస్ హెట్జిస్ ను అంతా అభినందిస్తున్నారు.

More Telugu News