: కార్లపై మమకారం... ఎగబడి కొనేస్తున్న భారతీయులు!

ఇండియాలో కార్ల అమ్మకాలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఈ పండగ సీజనులో అత్యంత కీలకమైన అక్టోబర్ నెలలో మొత్తం 1,94,158 కార్ యూనిట్ల అమ్మకాలు జరిగాయని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించింది. 2014 అక్టోబర్ అమ్మకాలు 1,59,408 యూనిట్లతో పోలిస్తే, ఇది 21.8 శాతం అధికమని తెలిపింది. కాగా, గత ఆరేళ్ల పండగ సీజన్లలో ఈ స్థాయిలో అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో మోటారు సైకిళ్ల అమ్మకాలు మాత్రం కార్ల స్థాయిలో పెరగలేదని పేర్కొంది. బైకుల విక్రయాలు 5.66 శాతం వృద్ధిని నమోదు చేసి, గత సంవత్సరంతో పోలిస్తే 10,08,761 యూనిట్ల నుంచి 10,65,856 యూనిట్లకు పెరిగాయని, మొత్తం ద్విచక్ర వాహన విక్రయాల్లో 13.31 శాతం వృద్ధి నమోదైందని సియామ్ తెలియజేసింది. ఇక వాణిజ్య వాహన విభాగంలో 12.73 శాతం వృద్ధి నమోదు అయినట్టు పేర్కొంది. నవంబర్ లో సైతం సంతృప్తికరమైన వాహన అమ్మకాలు సాగవచ్చని వాహన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News