: 'వైవాహిక బంధం' తెగుతుందనడానికి సంకేతాలివి!

పెళ్లి చేసుకుని జీవితాంతం భాగస్వామితో సుఖంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కానీ చాలా కారణాలతో ఎన్నో వైవాహిక బంధాలు తెగుతుంటాయి. వీటిల్లో అత్యధిక కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. కేవలం చర్చలతో వీటికి పరిష్కారం వెతుక్కోవచ్చు. అంతకన్నా ముందు వైవాహిక బంధం తెగిపోయే పరిస్థితి వస్తోందని చెప్పడానికి ఎన్నో సంకేతాలు ఎదురవుతాయి. వీటిల్లో ఏది కనిపించినా, కాస్త జాగ్రత్తపడితే విడాకుల వరకూ పోయే అవసరం రాదు. మీ వైవాహిక బంధం కష్టాల్లో పడిందా? లేదా? అన్నది తెలుసుకోవాలని వుందా? ఇవే ఆ సంకేతాలు... * గతాన్ని తవ్వుకోవడం, ప్రేమతో పెట్టుకున్న ముద్దు పేర్లు వదిలి అసలు పేర్లు పెట్టి పిలుచుకోవడం, మాటలతో వేధించడం, పురుషులైతే బావమరిదిని, మహిళలైతే ఆడపడుచునూ తిట్టి పోస్తుండటం సాధారణమైపోయినా సమస్య ఉన్నట్టే! * లేనిపోని చిన్న కారణాలకు యుద్ధం చేస్తుండటం, ఒకరిని ఒకరు పట్టించుకోకుండా తమ దారిన తాము వెళుతుండటం బంధం తెగుతుందనడానికి సంకేతాలు. అలాగే ఈ సమస్యకు పరిష్కారమే కనిపించడం లేదని భావించినప్పుడు కూడా జాగ్రత్తపడాలి. * భార్యాభర్తలిద్దరూ కలసి నిర్ణయాలు తీసుకోలేకపోతున్న వేళ, ఏదైనా తప్పు జరిగినప్పుడు మీరు చెప్పే సమాధానానికి లాజిక్ మిస్ అయినప్పుడు, నేను చెప్పేదే నిజమన్న ఈగో పెరుగుతున్నప్పుడు సమస్య ఉన్నట్టే! * భాగస్వామి చెబుతున్నది నిజం కాదని అనిపిస్తున్న వేళ, అతను లేదా ఆమెను చూసి జలసీగా ఉన్నప్పుడు వైవాహిక బంధంలో తేడా ఉన్నట్టు భావించాలి. * ఇంట్లోనే బయటివ్యక్తిగా ఉండాల్సి వచ్చినప్పుడు, అతను లేదా ఆమె మిమ్మల్ని పట్టించుకోవడం లేదన్న భావన తరచూ వస్తుంటే, పరిస్థితిని ఆకళింపు చేసుకుని సమస్యను తక్షణం పరిష్కరించుకునేందుకు చొరవ చూపాల్సి వుంటుంది. అలా కాకుంటే... * వైవాహిక బంధాన్ని నిలిపివుంచే లైంగిక సంబంధం విషయంలో అంటీ ముట్టనట్టు ఉండటం, యాంత్రికత పెరగడం, జీవిత భాగస్వామి ఆసక్తిగా లేకపోవడం గమనిస్తుంటే... * ఏ విధమైన సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం.. అంటే భార్యాభర్తలు దూరంగా ఉన్న వేళ, కనీసం బాగున్నావా? అని టెక్ట్స్ మెసేజ్ రాకపోవడం, రోజుకు ఒకసారన్నా ఫోన్లో మాట్లాడుకోలేక పోవడం కూడా బంధం తెగే సమయం తరుముకు వస్తోందన్న విషయాన్ని గుర్తు చేస్తుంటుంది. ఇక వీటిల్లో ఏ రెండు, మూడు మీ జీవితంలో ఉన్నాయని అనుకున్నా, సమస్యలు మరింతగా పెరగకముందే వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగితే, మరింతకాలం ఒకరికి ఒకరు తోడుగా నిలవగలుగుతారు.

More Telugu News