: ఆరోగ్యం బాగాలేకున్నా ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే...!

ఒంట్లో నిస్సత్తువగా వున్నా, ఆరోగ్యం బాగాలేకున్నా, శరీరం విశ్రాంతిని కోరుతున్నా, మీరు ఆఫీసుకు వెళుతున్నారా? ఆరోగ్యాన్ని మరింతగా పాడు చేసుకునే ఈ తరహా చర్యలను ఉద్యోగులు ఎందుకు చేస్తున్నారన్న విషయమై బ్రిటన్ కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా ఓ అధ్యయనం చేసింది. దీని ఫలితాల ప్రకారం, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుండటం, జీతం కట్ అవుతుందన్న భావన, ఒత్తిడి, తమ స్థానాన్ని ఇతరులు ఆక్రమిస్తారేమోనన్న అభద్రతా భావాలతోనే జబ్బులు, రోగాలు పీడిస్తున్నా, శరీరం అలసటగా ఉన్నా ఉద్యోగులు ఆఫీసులు వెళ్లడానికే నిర్ణయించుకుంటామని అధ్యయన నివేదిక రూపకర్త డాక్టర్ మిరాగిలియా వెల్లడించారు. అయితే, పక్కవారు ఆరోగ్యం సరిగ్గా లేకున్నా ఆఫీసుకు రావడం వల్ల ఇతరులకు స్ఫూర్తిగా ఉంటున్నారని తెలిపారు. సరిగ్గా పనిచేయలేమని, మధ్యలో ఆపేసే ప్రమాదముందని తెలిసి కూడా ఆత్యధిక ఉద్యోగులు తమకు వచ్చే చిన్న చిన్న జబ్బులను పట్టించుకోవడం లేదని ఆయన వివరించారు. ఈ ఫలితాల కోసం 1.75 లక్షల మందిని ఈ అధ్యయనంలో భాగం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

More Telugu News