: కేన్సర్, గుండెపోటు, ఇన్ఫెక్షన్ల నివారణి మన వంటింట్లోనే ఉంది!

మనం వంటల్లో వాడే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కేన్సర్ కు నివారణిగా వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుందని వారు చెబుతున్నారు. అలాగే, శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను అరికట్టి, గుండెపోటు రాకుండా అడ్డుకునే దివ్యౌషధంలా వెల్లుల్లి పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ నాలుగు వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి, కాసేపయ్యాక తింటే మంచి ఫలితం ఉంటుందని వారు సూచిస్తున్నారు. వెల్లుల్లిలో గంధక రసాయనాలు భారీగా ఉంటాయి. అసలు వెల్లుల్లి నుంచి ఘాటు వాసన వచ్చేది వీటి వల్లే! వెల్లుల్లిలో వుండే అజోయేన్ రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే వాటిలో ఉండే అలిసిన్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గా పని చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశం లేకుండా చేస్తుంది. రక్తనాళాలు ముడుచుకుపోయేలా చేసే యాంజియోటెన్సిస్ అనే ప్రోటీన్ ను అలిసిన్ అడ్డుకుని రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. వెల్లుల్లిలోని పాలిసలైడ్లు శరీరంలో ప్రవేశించాక హైడ్రోజన్ సల్ఫైడ్ గా మారి రక్తనాళాలు సాగేలా చేసి రక్తపోటును తట్టుకునేలా చేస్తాయి. వెల్లుల్లిలో ఉండే అలీల్ సల్ఫైడ్ లు కొన్ని రకాల కేన్సర్లకు నివారణిగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News