: మొబైల్ టచ్ స్క్రీన్లు ఇక పగలవు!

ఇనుము, ఉక్కుకన్నా గట్టిగా ఉండేలా అమోనియం డయాక్సైడ్ తో తయారైన గాజు వచ్చేసింది. టోక్యో యూనివర్శిటీలోని ఇండస్ట్రియల్ టెక్నాలజీ విభాగం పరిశోధకులు దీన్ని తయారు చేశారు. సెల్ ఫోన్ స్క్రీన్లతో పాటు వాహనాలకూ దీన్ని వినియోగించవచ్చని వారు చెబుతున్నారు. ఈ గాజును వాడటం వల్ల ఫోన్ల మందాన్ని మరింతగా తగ్గించవచ్చని కూడా వారు వెల్లడించారు. లోహాల కన్నా గట్టిదైన ఈ గాజు మన మొబైల్ ఫోన్ లో వాడితే, "స్క్రీన్ పగిలింది. ఇక ఫోన్ పని అయిపోయినట్టే" అనుకునే అవసరం రాదు కదా?

More Telugu News