: మూడీగా ఉండడం కూడా ఒకందుకు మంచిదేనట!

మూడీగా (ముభావంగా) ఉండడం కూడా ఒకందుకు మంచిదేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మూడీగా ఉండడం వల్ల కొన్ని దుష్పరిణామాలు సంభవించవచ్చేమో కానీ, వ్యక్తగతంగా సత్వర మార్పు వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మూడీగా ఉండేవారు జీవితానికి సంబంధించిన సానుకూల లేదా ప్రతికూల అంశాలను స్వాగతిస్తారని పరిశోధనలు చెబుతున్నాయని సూచిస్తున్నారు. మూడీ నెస్ వ్యక్తిగతంగా సత్వర మార్పును స్వీకరించేందుకు ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ ఎల్దార్ పేర్కొన్నారు. అయితే ఈ మూడీనెస్ ను పాజిటివ్ గా తీసుకోవాలా? లేక నెగిటివ్ గా తీసుకోవాలా? అనేది వారిష్టమని ఆయన తెలిపారు. మూడీగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రభావం వంతంగా ఉంటాయి కనుక ఈ సమయాల్లో నైపుణ్యాలు పెంచుకోవడం, సామాజిక లక్ష్యాలు అందుకోవడం, హోదా, హుందాతనం పెంచే లక్ష్యాలు నిర్దేశించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు.

More Telugu News