ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫొటోల్లో మరింత స్లిమ్ గా కనిపించాలనుకుంటున్నారా ? అయితే, ఇలా ట్రై చేయండి!

Mon, Nov 02, 2015, 10:56 AM
మీ మిత్రులతో కలసి గ్రూప్ ఫొటో దిగే వేళ మీరు లావుగా ఉన్నానని, అలాగే చిత్రంలో కనిపిస్తానని ఆందోళన చెందుతున్నారా? ఫోటోల్లో సన్నగా కనిపించాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలివి...

* కెమెరాకు ఎదురుగా ఎప్పుడూ నిలుచోవద్దు: మీ కాళ్లను కొద్దిగా పక్కకు తిప్పి, నడుము పై భాగాన్ని ఫోటోగ్రాఫర్ వైపు తిప్పడం ద్వారా, తీసే చిత్రాల్లో లావుగా ఉన్న భాగాలు సన్నగా కనిపిస్తాయి. మీరు మరింత అందంగా కనిపిస్తారు కూడా!

* ధరించిన దుస్తులపైనా శ్రద్ధ పెట్టాలి: ఒకవేళ మీరు లోదుస్తులు ధరించి స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఫోటోలు తీయించుకోవాల్సి వస్తే, శరీరాన్ని చుట్టి ఉంచే సరోంగ్ వంటివి ధరిస్తే మేలు.

* నిటారుగా నిలబడితే మరింత అందం: కెమెరా ముందు నిటారుగా నిలుచుని, లావుగా కనిపించే ఉదర భాగాన్ని లోపలికి లాగి, భుజాలను వెనక్కు పెట్టడం ద్వారా ఫోటోల్లో సన్నగా కనిపించవచ్చు. దీంతో పాటు చేతులను శరీరానికి ఆనుకొని ఉంచకుండా, కాస్తంత దూరంగా పెడితే తీసే చిత్రంలో మరింత నాజూకుగా కనిపిస్తారు.

* కెమెరావైపే చూడాలి: ఫోటోలు తీసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలను ముందుకు వంచకూడదు. కెమెరా లెన్స్ వైపే కళ్లను ఉంచడం ద్వారా 'డబుల్ చిన్' సమస్యను తప్పించుకోవచ్చు.

* వెన్నెముక నిటారుగా ఉంచాలి: పాదాల నుంచి వెన్నెముక వరకూ నిటారుగా ఉంచి తలపై ఉన్న కిరీటాన్ని ఎవరో లాగేస్తున్నారన్న ఆలోచనతో తలను కూడా నిటారుగా ఉంచితే, మీరిచ్చే ఫోజు పదికాలాలు నిలుస్తుంది.

* కాళ్లు మడత పెట్టకూడదు: ఓ కాలు ముందు మరో కాలును పెట్టి ఫోటోలు దిగడం ద్వారా సన్నగా ఉన్న భాగాలు సైతం లావుగా కనిపిస్తాయి. రెండు కాళ్లూ నిటారుగా నేలపై ఉంచడం లేదా ఓ కాలుపై బరువుమోపుతూ ఇచ్చే ఫోజులు మంచి దృశ్యాలను అందిస్తాయి. దీంతో పాటు తెచ్చిపెట్టుకున్న నవ్వు కాకుండా సహజ చిరునవ్వు చిత్రానికి మరింత ప్రాణాన్ని ఇస్తుంది.

* ఒకడుగు వెనకుంటే మరింత సన్నం: ఓ గ్రూప్ ఫోటో దిగేముందు అందరూ వరుసగా నిలబడితే, మిగతావారితో పోలిస్తే ఒకడుగు వెనకుండడం ద్వారా కూడా సన్నగా కనిపించవచ్చు. ముందున్నవారి శరీరాలు పెద్దగా కనిపిస్తాయి కాబట్టి.

ఈ టిప్స్ పాటిస్తే తీసే ఫోటోల్లో మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఈసారి మీరూ ట్రై చేయండి!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Articles (Latest)
Articles (Education)