: విడిపోయిన టెక్ దిగ్గజం హ్యూలెట్ - పాకార్డ్

దాదాపు 77 సంవత్సరాల క్రితం బిల్ హ్యూలెట్, డేవ్ పాకార్డ్ లు కలసి స్థాపించిన టెక్ సంస్థ, సిలికాన్ వ్యాలీకి పునాదిరాయిగా నిలిచిన 'హ్యూలెట్ - పాకార్డ్' విడిపోయింది. అందరూ ముద్దుగా 'హెచ్పీ' అని పిలుచుకునే ఈ సంస్థ ఇకపై రెండు వేర్వేరు సంస్థలుగా మార్కెట్లో ఉంటుంది. హెచ్పీ వ్యాపార సామ్రాజ్యం ఆదివారంతో వేరుపడిందని ఇరు సంస్థల అధికారులు తెలిపారు. ఇది సంస్థ చరిత్రను మరో మలుపు తిప్పే ఘటనగా వారు అభివర్ణించారు. అయితే, రెండు సంస్థల కొత్త పేర్లు హెచ్పీ అక్షరాలను కలిగివుంటాయని ఓ అధికారి తెలిపారు. సాఫ్ట్ వేర్, బిజినెస్ సేవలను హెచ్పీ ఎంటర్ ప్రైజెస్ చూసుకుంటుందని, కంప్యూటర్, ప్రింటర్ తదితర ఉత్పత్తులు హెచ్పీ ఐఎన్సీ పేరిట మార్కెటింగ్ అవుతాయని సంస్థ ప్రతినిధులు వివరించారు.

More Telugu News