: ఒంటికాలిపై నిమిషం నిలబడలేకపోతే...!

కొన్ని రకాల జబ్బులు చెప్పకుండా వస్తాయి. వీటి గురించి సాధారణ స్కానింగులు, రక్త పరీక్షలూ కనిపెట్టలేవు. వాటిల్లో పక్షవాతం ఒకటి. ఇది వస్తే, కొన్ని అవయవాలు పనిచేయవు. ఇక ఆపై జీవితాంతమూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పక్షవాతం వస్తుందా? రాదా? అన్న విషయాన్ని పసిగట్టేందుకు వేల కొద్దీ రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ‘స్ట్రోక్’ అనే జర్నల్‌ లో ప్రచురించిన కథనం ప్రకారం పక్షవాతం వచ్చే అవకాశాలున్నాయా? అన్నది రూపాయి ఖర్చు కాకుండా తెలుసుకోవచ్చట. అదెలాగంటే... మీరు ఒంటికాలిపై కనీసం 20 సెకన్లు నిలబడలేకపోతున్నారా? అయితే, అవయవాల్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిన్నట్టే. ఇది పక్షవాతానికి తొలి సూచన. ఇక 20 సెకన్లపైగానే నిలవగలిగితే, వారికి పక్షవాతం వచ్చే అవకాశం ఇప్పట్లో లేనట్టే. ఇక ఒక నిమిషం పాటు కాలు కదపకుండా స్థిరంగా ఉంటే, వారికి పక్షవాతం మరింత దూరం. పలువురు ఎంతసేపు నిలుస్తారన్న విషయాన్ని పరిశీలించి, ఆపై వారి రక్త నాళాలకు పరీక్షలు జరిపామని పరిశోధకులు వెల్లడించారు. తమ వాదనలకు ఎంఆర్ఐ స్కానింగ్ మద్దతుగా నిలిచిందని వివరించారు. 20 సెకన్ల పాటు నిలవలేని వారి రక్తనాళాలు దెబ్బతిన్నట్టు గమనించామని, చివరికి ఇది పక్షవాతానికి, వినికిడి శక్తి కోల్పోవడానికి కారణమవుతుందని తెలిపారు. ఈ పరీక్షను నెలకు ఒకసారన్నా చేసుకుంటూ ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

More Telugu News