: టాటూలపై మోజుందా? అయితే మీరిది చదవాల్సిందే!

టాటూలపై మోజుందా? ఒంటిపై టాటూలు వేసుకోవడం ఫ్యాషన్ అని భావిస్తున్నారా? అయితే మీరు బ్లాక్ హెన్నా టాటూకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ హెన్నా టాటూ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ టాటూ వల్ల చర్మరోగాలు, ఆస్తమా, ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హెన్నాలో నల్ల రంగు కోసం ఓ రసాయనాన్ని కలుపుతారు. ఈ రంగే పెను ప్రమాదానికి కారణమవుతోందని వారు సూచిస్తున్నారు. బ్లాక్ హెన్నా టాటూ వేసుకోగానే బొబ్బలు లేస్తున్నాయనే ఆందోళనతో వైద్యులను సంప్రదించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని వారు చెబుతున్నారు. అమెరికాలో హెన్నా నేరుగా శరీరంపై వేసుకోవడంపై నిషేధం ఉంది. ఐరోపా దేశాల్లోనూ హెన్నా నేరుగా వినియోగించడంపై నిబంధనలు ఉన్నాయి. ఆసియాలోని పలు దేశాల్లో ఈ నిబంధనలు లేకపోవడంతో టాటూల మోజు రాజ్యమేలుతోంది. అలాగే టర్కీలో బ్లాక్ హెన్నా టాటూలపై బాగా మోజుంది. కొట్టొచ్చినట్టు కనబడడంతో బ్లాక్ టాటూను స్థానికులు, పర్యాటకులు విపరీతంగా వేసుకుంటారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో అనారోగ్యం బారినపడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో, ఇకపై బ్లాక్ టాటూ వేసుకునే ముందు ఆలోచించండి.

More Telugu News