: 4జీ సపోర్ట్, 5.5" స్క్రీన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ రామ్, 13 ఎంపీ కెమెరా... ధర రూ. 9 వేల కన్నా తక్కువే!

మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్ భారత మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రూ. 10 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న కంపెనీలకు పోటీని ఇస్తూ, 'కూల్ పాడ్ డాజెన్ 1 (నోట్ 3)' తన వినూత్న, అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో సంచలనం కలిగిస్తోంది. 5.5 అంగుళాల స్క్రీన్, 4జీ, వేగవంతమైన ప్రాసెసర్, 16 గిగాబైట్ల ఇన్ బిల్ట్ మెమొరీ, ఫ్రింగర్ ప్రింట్ సెన్సార్, మరింత బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా 3000 ఎంఎహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. అంతేకాదు, ఈ ఫోన్ బరువు కేవలం 155 గ్రాములు మాత్రమే. మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 1.3 జీహెచ్ వేగంతో పనిచేస్తుంది. 3జీబీ రామ్ ఒకేసారి పలు యాప్ లను వాడేందుకు సహకరిస్తుందని సంస్థ తెలుపుతోంది. వాట్స్ యాప్, ఫేస్ బుక్, అమేజాన్ వంటి పలు యాప్స్ ప్రీలోడెడ్ గా లభించిన ఫోన్ లో 13 మెగాపిక్సెల్ కెమెరా అదనపు ఆకర్షణ. ఫోన్ ను ఇంకొకరు తెరిచే వీలు లేకుండా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ తరహా ఫీచర్ రూ. 10 వేల లోపు ధర ఉన్న ఫోన్లలోకి రావడం ఇదే తొలిసారి. ఈ ఫోన్ ను పూర్తిగా చార్జింగ్ చేసి వీడియోలను చూస్తుంటే 11 గంటలకు పైగానే పనిచేస్తుందట. ఈ కూల్ పాడ్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న లెనోవో కే3 నోట్, యూ యురేకా ప్లస్ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీని ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News