: 66 లక్షల టయోటా కార్ల రీకాల్

66 లక్షల టయోటా కార్లను ఆ కంపెనీ రీకాల్ చేసింది. ఈ కార్ల తయారీలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా వాటిని టయోటా కంపెనీ వెనక్కి తీసుకుంటోంది. డ్రైవర్ సీటు పక్కన ఏర్పాటు చేసిన పవర్ విండో మాస్టర్ స్విచ్ లో సాంకేతిక లోపం ఏర్పడినట్టు గుర్తించిన టయోటా కంపెనీ దానిని సరి చేసేందుకు సమస్య ఉన్న కార్లను వెనక్కి రప్పించుకుంటోంది. ఈ స్విచ్ నెమ్మదిగా మెల్ట్ అయి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని టయోటా కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం సంభవించకున్నా, ముందు జాగ్రత్తగా వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నామని చెప్పింది. సమస్యను పరిష్కరించి వినియోగదారులకు అందజేస్తామని వారు వివరించారు. గతంలో టయోటా తయారు చేసిన కార్లలో ఎయిర్ బ్యాగ్ సమస్య తలెత్తినప్పుడు కూడా కంపెనీ ముందుగానే పరిష్కరించింది. ఇప్పుడు కూడా ముందుగానే సమస్యను గుర్తించి పరిష్కరిస్తున్నట్టు టాయోటా తెలిపింది. ఈ కార్లు కెనడా, బ్రిటన్ లో పెద్దఎత్తున అమ్ముడైనట్టు టయోటా పేర్కొంది.

More Telugu News