: వందలాది యాప్స్ తొలగించిన యాపిల్ యాప్ స్టోర్

కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో యాపిల్ సంస్థ తమ యాప్ స్టోర్ నుంచి వందలాది యాప్స్ డిలీట్ చేసింది. ఈ యాప్స్ వాడుతున్న వారి నుంచి ఓ చైనా సంస్థ తయారు చేసిన సాఫ్ట్ వేర్ రహస్యంగా చేరిపోయి, వాడకందారుల సమాచారాన్ని సేకరిస్తున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిల్లో థర్డ్ పార్టీ వ్యాపార ప్రకటనలు వస్తున్నాయని, దీన్ని చైనా మొబైల్ సంస్థ యోమీ తయారు చేసిందని వెల్లడించింది. మొత్తం 250కి పైగా యాప్స్ తొలగించామని పేర్కొంది. తమ స్టోర్లోని మిగతా యాప్స్ నూ పరిశీలిస్తున్నట్టు తెలియజేసింది.

More Telugu News