: ఆవిరి పడితే ఎంత మంచిదో తెలుసా?!

ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు నీటిని మరిగించి, అందులో కాస్తంత జండూబామ్ లేదా అమృతాంజన్ వేసి ఆవిరి పట్టుకోవడం అందరూ చేసేదే. ఇదే ఆవిరి పట్టుకోవడాన్ని నిత్యమూ చేస్తే అందం పెరగడంతో పాటు ఆరోగ్యానికి మంచి జరుగుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. * రెండు గ్లాసుల నీటిని వేడి చేసి అందులో వన మూలికలు, అవి అందుబాటులో లేకుంటే, కనీసం టీ బ్యాగులను ఉంచి ఆవిరి పట్టుకున్నా, ముఖం తాజాగా మెరిసిపోతుంది. ఇదే సమయంలో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు వేసుకుంటే, ముఖానికి తేమ తగలడమే కాకుండా, సూక్ష్మ రంధ్రాలు తెరచుకుంటాయి. * నీటిలో పుదీనా ఆకులను వేసుకోవడం, నిమ్మగడ్డిని ఉంచడం లేదా యూకలిప్టస్ ఆకులతో తయారైన నూనెను వేయడం వల్ల చిన్నారులకు జలుబు దూరమవుతుంది. * దైనందిన జీవితం పని ఒత్తిడితో అలసి పోతున్న వేళ, కండరాలను ఉత్తేజింప చేసేందుకు ఆవిరి పట్టుకోవడం అత్యుత్తమ మార్గాల్లో ఒకటి. దీని వల్ల తిన్న ఆహారం సాఫీగా జీర్ణం కావడంతో పాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. * ఉబ్బసం, ఆయాసం, జలుబు వంటి రుగ్మతలతో బాధపతుతున్న వేళ ఏర్పడే ముక్కు దిబ్బడ నుంచి ఆవిరి పట్టడం వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. ఆపై సులభంగా ఊపిరి పీల్చుకోగలుగుతారు కూడా.

More Telugu News