: చిన్న కంపెనీలకు రుణాలిచ్చేందుకు రూ. 1000 కోట్లు సిద్ధం చేసిన స్నాప్ డీల్

దేశంలోని చిన్న, మధ్య తరహా కంపెనీలకు రుణాలిచ్చి ప్రోత్సహించాలని ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 1000 కోట్ల 'మూలధన సహాయం' రుణాలను వచ్చే ఆరు నెలల్లో ఇవ్వనున్నామని తెలిపింది. ఈ పండగ సీజనులో సాధ్యమైనంత ఎక్కువగా విస్తరించాలని నిర్ణయించుకున్నామని, ఆపై వచ్చే మూడేళ్లలో 2 లక్షల మంది అమ్మకందారులను స్నాప్ డీల్ గొడుగు కిందకు ఆహ్వానించాలన్నది తమ అభిమతమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కునాల్ భాల్ తెలిపారు. ఉత్పత్తిదారులు మరింత నాణ్యమైన ప్రొడక్టులు తయారు చేసేలా వారికి శిక్షణా కార్యక్రమాలను ఇవ్వనున్నామని తెలిపారు. ఇప్పటివరకూ తాము సున్నా శాతం నిరర్థక ఆస్తులను కలిగివున్నామని, తమ పెట్టుబడుల్లో ఒక్క రూపాయి కూడా వృథా కాలేదని తెలిపారు. తమ వద్ద రుణాలు పొందిన కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయ సేవలను సైతం తామే చేపట్టనున్నట్టు వివరించారు.

More Telugu News