: ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు నాలుగురెట్లు పెంచాలి : స్వతంత్ర కమిటీ సూచన

ఢిల్లీ ఎమ్మెల్యేల నెలవారీ వేతనాలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో, జీతభత్యాలతో కలిపి లక్షల రూపాయల్లో ఎమ్మెల్యేలు తమ జీతం అందుకుంటారు. ఎమ్మెల్యేల జీత భత్యాల విషయమై ఏర్పాటైన స్వతంత్ర కమిటీ ఈ మేరకు ఢిల్లీ సర్కార్ కు ఒక సిఫారసు చేసింది. ఎమ్మెల్యేల జీతాలను ప్రస్తుతమున్న రూ.12 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని సూచించింది. దీంతో పాటు నియోజకవర్గ అలవెన్స్ రూ.18వేల నుంచి రూ.50 వేలకు, వాహన అలవెన్స్ రూ.6 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని స్వతంత్ర కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు ఎమ్మెల్యేల జీతభత్యాలు ప్రస్తుతమున్న రూ.88 వేల నుంచి రూ.2.10 లక్షలకు పెరిగే అవకాశముంది. సహాయ సిబ్బంది కోసం రూ.70వేలు, నియోజకవర్గ అలవెన్స్ కింద రూ. 50 వేలు అదనంగా ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది. మొత్తానికి ఎమ్మెల్యేల జీతాలను నాలుగు రెట్లు పెంచాలని స్వతంత్ర కమిటీ సూచించింది. అయితే, స్వతంత్ర కమిటీ సిఫారసులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

More Telugu News