: భూమి మీద గొప్ప వ్యాయామ క్రీడాకారుడితడే!

భూమి మీదున్న జీవుల్లో గొప్ప వ్యాయామ క్రీడాకారుడిగా చేప నిలిచిందని ఓ అధ్యయనం తెలిపింది. చేపల్లో శ్వాస వ్యవస్థ మిగతా జీవుల్లోని శ్వాస వ్యవస్థ కంటే 50 రెట్లు ఎక్కువ చురుకుగా పని చేస్తుండడమే దీనికి కారణమని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపైనున్న అన్ని జీవుల కంటే చేపల్లోనే ఆక్సిజన్ సరఫరా చాలా క్రియాశీలకంగా ఉందని వారు వెల్లడించారు. చేప దేహంలోని కణజాలాల్లోకి ఆక్సిజన్ పెద్ద మొత్తంలో విడుదలవుతూ మిగతా జీవుల కన్నా 50 రెట్లు అధిక పనితీరు కనబరిచిందని, అందువల్లే చేప గొప్ప ప్రాణిగా నిలిచిందని ఆస్ట్రేలియాకు చెందిన ఏఆర్సీ సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఫర్ కోరల్ రీఫ్ స్టడీస్ రచయిత జోడీ రమ్మర్ తెలిపారు.

More Telugu News