: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగిచ్చేసిన నెహ్రూ మేనకోడలు

దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు, ప్రముఖ రచయిత్రి అయిన నయనతార సెహగల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాహిత్యరంగంలో కేంద్రం తనకు ఇచ్చిన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగి కేంద్రానికే పంపుతున్నట్టు ప్రకటించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికైనప్పటి నుంచి ప్రజాస్వామిక వాతావరణం చెడిపోయిందని, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లు పొడిచే ప్రక్రియ జరుగుతోందని నయనతార విమర్శించారు. ఈ తీరుకు నిరసనగానే 1986లో తనకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కిచ్చేస్తున్నట్టు చెప్పారు. నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ రెండో కూతురే ఈ నయనతార సెహగల్. ప్రముఖ ఆంగ్ల రచయితల్లో ఒకరిగా పేరున్న ఆమె రాసిన 'రిచ్ లైక్ అజ్' నవలకు కేంద్రం సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది.

More Telugu News