: మహారాష్ట్రలో బీఫ్ తరలిస్తున్న వాహనానికి నిప్పుపెట్టారు!

దేశంలోని పలు రాష్ట్రాల్లో బీఫ్ అమ్మకంపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆశ్చర్యపోయే ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీఫ్ పై నిషేధం అమలులో వున్న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి ఔరంగాబాద్ కు బీఫ్ ను తరలిస్తున్న వ్యాన్ కు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన రెండు రోజుల కిందట (ఆదివారం) చోటు చేసుకుంది. గోమాంసాన్ని తరలిస్తుండగా సావ్ ఖేడా గ్రామం వద్ద కొంతమంది వ్యాన్ ను ఆపి డ్రైవర్ తో ఘర్షణకు దిగారు. గొడవ మితిమీరడంతో ఆగ్రహించి వాహనానికి నిప్పంటించారు. ఇది తెలిసిన పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వ్యాన్ ను పరిశీలించారు. ఆ వ్యాన్ ద్వారా బీఫ్ ను తరలిస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. దాదాపు వంద కేజీల మాంసాన్ని తరలిస్తున్నట్టు ఔరంగాబాద్ ఎస్పీ నవీన్ చంద్రరెడ్డి తెలిపారు. ఈ ఘటనలో వ్యాన్ పాక్షికంగా తగలబడిందని, డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అయితే డ్రైవర్ పై, నిప్పు పెట్టిన ఆందోళనకారులపై కేసు పెట్టినట్టు తెలిపారు.

More Telugu News