: ప్రపంచ హార్డ్ వేర్ ను కదిలించే సత్తా ఉన్న సాఫ్ట్ వేర్ మాదే: మోదీ

శరవేగంగా విస్తరిస్తున్న టెక్ ప్రపంచపు హార్డ్ వేర్ ను కదిలించగలిగే సత్తా 'డిజిటల్ ఇండియా' అన్న సాఫ్ట్ వేర్ కు మాత్రమే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం బెంగళూరులో జరిగిన ఇండో-జర్మన్ సదస్సులో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ, డిజిటల్ ఇండియా తీరుతెన్నులను, దాన్ని అమలు చేయాలనుకుంటున్న తీరును వివరించారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత గత 15 నెలల కాలంలో ఇండియాలో వ్యాపారం చేసేందుకు ఎన్నో అనుకూల పరిస్థితులను కల్పించామని చెప్పారు. మిగతా ప్రపంచంలో విదేశీ పెట్టుబడులు మందగిస్తున్న వేళ, ఇండియా ముందుకు దూకిందని, దేశ ఆర్థిక మూలాలపై విదేశీ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. ఈ సదస్సుకు భారత్, జర్మనీలకు చెందిన పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

More Telugu News