: అంతా మన మంచికే అనుకోండి.. 'ఆల్ హ్యాపీస్'!

మనం అనుకున్న పనులు అవకపోతే చికాకు, మనం చెప్పిన మాట ఎవరైనా వినకపోతే కోపం, అందాల్సిన డబ్బు సమయానికి అందకపోతే టెన్షన్ పడటం.. ఏవేవో ఆలోచనలతో స్థిమితంగా ఉండలేని తనం, వీటన్నింటి నుంచి బయటపడే మార్గం తెలియక నిరాశావాదంలో కూరుకుపోతే అనారోగ్యం పాలై బతుకు దుర్భరమవుతుంది. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. దాని నుంచి బయట పడాలంటే, ఒకే ఒక మార్గం ఆశావహ దృక్పథాన్ని అవలవర్చుకోవడం. అంతా మన మంచికే జరిగిందనుకుంటే.. జీవితం 'ఆల్ హ్యాపీస్'గా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను దరి చేరకుండా చేసుకోవచ్చట. ఈ విషయాన్ని సైకోసొమాటిక్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించారు. తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. పెన్ స్టేట్ అనే సంస్థ ఈ మేరకు ఒక రీసెర్చీ నిర్వహించింది. కరోనరి హార్ట్ డిసీజ్ ఉన్న రోగులు సుమారు 1,000 మందిని పరిశీలించగా.. నెగెటివ్ ఎమోషన్స్ ఉన్న వారి కంటే పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నవారికి శారీరక ఉత్సాహం, మంచి నిద్ర పట్టడం జరుగుతోందట. గుండె సంబంధిత మందులు వాడుకుంటూ వీరు చాలా సంతోషంగా కాలం గడుపుతున్నారు. నెగెటివ్ ఎమోషన్స్, ఒత్తిడి అనేవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. పాజిటివ్ ఎమోషన్స్ అనేవి దీర్ఘకాలంగా ఉన్న మంచి అలవాట్లకు సమానం. భవిష్యత్ లో ఎటువంటి గుండె సమస్యలు రాకుండా ఇవి తోడ్పడతాయని ఆ జర్నల్ లో పేర్కొన్నారు.

More Telugu News