: అగ్రిగోల్డ్ విచారణ ఈ నెల 9కి వాయిదా

అగ్రిగోల్డ్ సంస్థ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. దాంతో ఈ కేసులో ఆస్తుల వేలంపై ఏర్పాటు చేయాల్సిన పర్యవేక్షణ కమిటీపై నిర్ణయం కూడా వాయిదా పడింది. అగ్రిగోల్డ్ కు చెందిన మరో 300 ఆస్తులకు సంబంధించి మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ కు చెందిన మూడు ఆస్తులమ్మేందుకు కోర్టు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆస్తుల విక్రయంపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని అగ్రిగోల్డ్ ను ఆదేశించింది. ఆస్తుల వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ పేరుతో ప్రత్యేక ఖాతా తెరిచి అందులో జమ చేయాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 9కి విచారణ వాయిదా వేసింది.

More Telugu News