: ‘శుభ్ బద్రినాథ్ యాత్ర’ మొబైల్ యాప్ ప్రారంభం

చార్ థామ్ లో బదరీనాథ్ ఒకటి. ఈ యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ‘శుభ్ బద్రీనాథ్ యాత్ర’ పేరిట ఒక మొబైల్ యాప్ ను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జోషి మఠ్ నుంచి బద్రీనాథ్ వరకు తీర్థయాత్ర విశేషాలను ఈ యాప్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. మరో విషయం ఏమిటంటే, భక్తులు యాత్ర సమయంలో ఆన్ లైన్ లో ఉంటే కనుక వారు ఉన్న ప్రదేశం నుంచి వెళ్లాల్సిన మార్గాన్ని తెలియజేస్తుందన్నారు. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, బస్టాండ్లు, పెట్రోల్ బంకులు, ఏటీఎం సెంటర్లతో పాటు అత్యవసర సేవల సమాచారం కూడా ఈ యాప్ ద్వారా గూగుల్ మ్యాప్స్ లో భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు. చార్ థామ్ లో వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాలను అందించేలా ‘శుభ్ బద్రీనాథ్ యాత్ర’ యాప్ ను రూపొందించామన్నారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్ యాత్రలకు సంబంధించిన మొబైల్ యాప్ ను త్వరలోనే తీసుకువస్తామని హరీశ్ రావత్ చెప్పారు.

More Telugu News