: లాభాల కోసం ఇన్వెస్టర్ల పరుగులు!

సెషన్ ఆరంభంలో 250 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్, లాభాల స్వీకరణ అధికంగా జరగడంతో దిగివచ్చింది. ఉదయం 9.20 గంటల సమయంలో 26,429 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ సూచిక 11 గంటలకు 26,187 పాయింట్లకు పడిపోయింది. ఆపై సెషన్ ఆసాంతం తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. బుధవారం నాడు రూ. 96,48,764 కోట్ల వద్ద ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 96,54,692 కోట్లకు పెరిగింది. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 66.12 పాయింట్లు పెరిగి 0.25 శాతం లాభంతో 26,220.95 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 2 పాయింట్లు పెరిగి 0.03 శాతం లాభంతో 7,950.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.18 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.20 శాతం పెరిగింది. ఎన్ఎస్ఈ-50లో అల్ట్రాటెక్ సిమెంట్, లుపిన్, జడ్ఈఈఎల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ కంపెనీల ఈక్విటీలు లాభపడ్డాయి. ఇదే సమయంలో హెచ్సీఎల్ టెక్, బీహెచ్ఈఎల్, గెయిల్, మారుతి సుజుకి, వీఈడీఎల్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

More Telugu News