: ఇండియాలో కుంటుబడ్డ ఉత్పత్తి రంగం!

ఇండియాలో ఉత్పత్తి రంగానికి అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని, ప్రొడక్టివిటీ కుంటుపడుతోందని విశ్లేషకులు వేసిన అంచనాలు నిజమయ్యాయి. నేడు నిక్కీ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ (పర్చేజ్ మేనేజింగ్ ఇండెక్స్) గణాంకాలు విడుదల కాగా, గడచిన సెప్టెంబరులో ఇండియాలో ఉత్పత్తి రంగం ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అంతకుముందు ఆగస్టులో 52.3గా ఉన్న పీఎంఐ, గత నెలలో 51.2కు తగ్గింది. పలు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని నివేదిక తయారు చేసిన మార్కిట్ సంస్థ విశ్లేషకుడు పొల్లియానా డీ లిమా విశ్లేషించారు. ఇండియాలో ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా లేవనడానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఇదే సమయంలో చైనా వంటి దేశాల్లో నెలకొన్న మాంద్యం కూడా ఇండియాపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. కాగా, పరపతి సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఉత్పత్తి రంగానికి ఊతమిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

More Telugu News