: నెక్సస్ 6పీ...ఐఫోన్ 6ఎస్ ప్లస్ కంటే డబుల్ స్పీడ్ లో చార్జింగ్... ఇక ప్రత్యేకతలేంటంటే...!

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ‘నెక్సస్’ సిరీస్ లో తాజాగా విడుదల చేసిన నెక్సస్ 6పీని చార్జింగ్ చేయడం చాలా ఈజీ అట. క్షణాల్లో ఆ ఫోన్ బ్యాటరీ చార్జ్ అవుతుందట. స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ‘యాపిల్’ తాజా మోడల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ కంటే డబుల్ స్పీడ్ లో నెక్సస్ బ్యాటరీ చార్జింగ్ పూర్తవుతుందని గూగుల్ ప్రకటించింది. నిన్న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో గూగుల్ నెక్సస్ 6పీతో పాటు నెక్సస్ 5ఎక్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు ఫోన్లలోనూ ఇన్ బిల్డ్ మెమరీ స్టోరేజీ మాత్రమే ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డును ఈ ఫోన్లు సపోర్ట్ చేయవు. ఈ ఫోన్ల ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. నెక్సస్ 5ఎక్స్... స్క్రీన్ : 1080x1920p హెచ్ డీ రిజల్యూషన్ తో కూడిన 5.2 అంగుళాలు ర్యామ్: 2జీబీ, 64 బిట్ స్నాప్ డ్రాగన్ 808 ప్రాసెసర్ మెమరీ: 16, 32 జీబీ కెమెరా: 1.5 5మైక్రాన్ సెన్సార్ తో కూడిన 12.3 ఎంపీ కెమెరా (రియర్) బ్యాటరీ: 2,700 యాంప్స్ బ్యాటరీ కలర్స్: బ్లాక్, వైట్, బ్లూ నెక్సస్ 6పీ... స్క్రీన్ : 1440x2560p హెచ్ డీ రిజల్యూషన్ తో కూడిన 5.7 అంగుళాలు ర్యామ్: 3జీబీ, 64 బిట్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్ మెమరీ: 32, 64, 128 జీబీ కెమెరా: 1.5 5మైక్రాన్ సెన్సార్ తో కూడిన 12.3 ఎంపీ కెమెరా(రియర్), 8ఎంపీ ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 3,450 యాంప్స్ బ్యాటరీ కలర్స్: వైట్, గ్రే, అల్యూమినియం

More Telugu News