: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి... అర్ధ శతకం పూర్తి

వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ 'ఇస్రో' మరో మైలురాయిని అధిగమించింది. విదేశీ శాటిలైట్లను నింగిలోకి పంపడంలో అర్ధ శతకాన్ని పూర్తి చేసింది. నేడు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-30 ద్వారా ఆరు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే భారత్ ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50ని దాటింది. మరోవైపు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఇస్రో భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశానికి సంపాదించి పెడుతోంది. ఇస్రో సక్సెస్ రేటు అత్యద్భుతంగా ఉన్నందున తమ ఉపగ్రహాలను ప్రయోగించమంటూ విదేశాలు క్యూ కడుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ఉపగ్రహాలను కూడా నింగిలో ప్రవేశ పెట్టిన ఘనత ఇస్రోది. ఈ రోజు కూడా అమెరికాకు చెందిన నాలుగు చిన్న తరహా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.

More Telugu News