: నేను చూశాను... ఇండియా మారుతోంది: సత్య నాదెళ్ల

అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఇండియా శరవేగంగా దూసుకెళుతోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ ఉదయం (అమెరికన్ కాలమానం ప్రకారం, శనివారం రాత్రి 8 గంటలు) ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల ప్రసంగిస్తూ, ఇటీవలి తన భారత పర్యటనలో ఇండియా మారుతున్న సంగతిని స్పష్టంగా గమనించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో బడి మానేసిన చిన్నారుల వివరాలు తెలుసుకునేందుకు టెక్నాలజీని వాడుతున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. గ్రామీణ పాఠశాలల్లో స్కైప్ వంటి యాప్స్ ద్వారా విద్యాబోధన జరుగుతుండటం అద్భుతమని వ్యాఖ్యానించారు. అతి తక్కువ ఖర్చుతో గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని అందిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటని, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు క్లౌడ్ కంప్యూటింగ్ సదుపాయాన్ని వినియోగిస్తూ, తమ బిజినెస్ ను విస్తరించుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశానికి యాపిల్, గూగుల్, అడోబ్ సహా పలు సిలికాన్ వ్యాలీ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు.

More Telugu News